Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు సిద్ధ‌మైన‌ 'రుద్రంకోట‌'

Rudramkota movie releasing on September 22
Advertisement
  • ఈ నెల 22న విడుదల కానున్న 'రుద్రంకోట'
  • అనిల్, విభీష, రియా హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం
  • కీలక పాత్రలో సీనియర్ నటి జయలలిత
Advertisement
సీనియ‌ర్ న‌టి జ‌య‌ల‌లిత స‌మ‌ర్ప‌కులుగా వ్య‌వ‌హరిస్తూ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం 'రుద్రంకోట‌'. ఏఆర్ కె విజువ‌ల్స్ ప‌తాకంపై రాము కోన ద‌ర్శ‌క‌త్వంలో అనిల్ ఆర్కా కండ‌వ‌ల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిల్‌, విభీష, రియా హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఇటీవ‌ల సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 22న స్క్రీన్ మాక్స్ పిక్చ‌ర్స్ సంస్థ ద్వారా వ‌ర‌ల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.

ఈ సంద‌ర్భంగా హీరో, నిర్మాత అనిల్ మాట్లాడుతూ... 'శ్మ‌శాన వాటిక‌లో పెరిగి పెద్దయిన ఓ యుకుడి ప్రేమ‌కథా చిత్ర‌మిది. భ‌ద్రాచలం ద‌గ్గ‌ర రుద్రంకోట అనే ఊరి నేప‌థ్యంలో క‌థ న‌డుస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ చూపించ‌ని అంశాల‌ను మా చిత్రంలో చూపిస్తున్నాము. ఇందులో అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునే అంశాలుంటాయి. సీనియ‌ర్ న‌టి జ‌య‌లలిత గారు స‌మ‌ర్ప‌కులుగా వ్య‌వ‌హరిస్తూ ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌లో న‌టించారు. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కులు కోటి గారు మా చిత్రానికి అద్భుత‌మైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. సుభాష్ ఆనంద్ అందించిన రెండు పాట‌లు  ఇప్ప‌టికే విడుద‌లై ప్ర‌జాద‌ర‌ణ పొందాయి. మా సినిమా న‌చ్చ‌డంతో  స్క్రీన్ మాక్స్ పిక్చ‌ర్స్ వారు విడుద‌ల చేయ‌డానికి ముందుకొచ్చారు. సెప్టెంబ‌ర్ 22న వ‌ర‌ల్డ్ వైడ్ గా సినిమాను గ్రాండ్ గా విడుద‌ల చేయ‌నున్నాం' అని తెలిపారు.
Advertisement
Advertisement
Rudramkota Movie
Tollywood
Jayalalitha

More Telugu News