టెన్త్ హిందీ పేపర్ లీక్ కేసులో విద్యార్థి హరీశ్‌పై డీబార్‌ను ఎత్తేసిన హైకోర్టు
- వరంగల్ జిల్లా కమలాపూర్ పరీక్ష కేంద్రం నుంచి బయటకు వచ్చిన ప్రశ్నాపత్రం
- దీనికి కారకుడు అంటూ హరీశ్‌ను డీబార్ చేసిన డీఈవో
- కోర్టు అనుమతితో పరీక్షలు రాసిన విద్యార్థి
అయితే పరీక్షలు పూర్తి అయి ఫలితాలు వచ్చినా అధికారులు హరీశ్ పదో తరగతి ఫలితాలను హోల్డ్‌లో పెట్టేశారు. ఫలితాలు వెళ్లడించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టును హరీశ్ కోరారు. దీనిపై ఈరోజు విచారణ చేపట్టిన న్యాయస్థానం హరీశ్‌పై డీబార్ ఉత్తర్వులు కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. అతను రాసిన పరీక్షల ఫలితాలను వెంటనే ప్రకటించాలని హైకోర్టు ఆదేశించింది