‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ చూసిన వెంటనే మెగాస్టార్ నన్ను, నవీన్‌ను ఇంటికి పిలిపించుకున్నారు: దర్శకుడు మహేశ్
- రెండో సినిమాకే చిరు నుంచి అభినందనలు రావడం
గొప్ప విషయమన్న మహేశ్ - కథను అనుష్క ఎంతో ఆస్వాదిస్తూ విన్నారన్న
యువ దర్శకుడు - మూడు నెలల సమయం తీసుకొని నవీన్ పోలిశెట్టి ఓకే చెప్పాడని వెల్లడి
ఇక, దర్శకుడిగా తాను తీసిన రెండో సినిమాకే అగ్ర కథానాయకుడు చిరంజీవి నుంచి అభినందనలు రావడం తనకు గొప్ప విషయం అన్నాడు. చిరంజీవి, సురేఖ దంపతులతోపాటు ఆ కుటుంబంలో పదిమంది ఈ చిత్రాన్ని చూశారని, వెంటనే మెగాస్టార్ ఫోన్ చేసి మెచ్చుకోవడంతో సంతోషంలో ఊగిపోయానన్నాడు. తనను, హీరో నవీన్‌ని ఇంటికి పిలిపించుకొని మాట్లాడారన్నాడు. గంటన్నర సమయం మెగాస్టార్ ఇంట్లో గడపడం మరిచిపోలేని అనుభూతిని, ఉత్సాహాన్ని ఇచ్చిందని మహేశ్ చెప్పుకొచ్చాడు.