జీ20 సమావేశాలకు మాస్క్ తో హాజరుకానున్న బైడెన్
- జిల్ బైడెన్ కు కరోనా పాజిటివ్ నేపథ్యంలో అధ్యక్షుడికి కరోనా టెస్టు
- రెండుమార్లు జరిపిన టెస్టులో నెగెటివ్ వచ్చిందని వైద్యుల వెల్లడి
- ముందుజాగ్రత్తగా మాస్క్ పెట్టుకుంటున్న అమెరికా ప్రెసిడెంట్
- ఇండియా పర్యటనలో ఎలాంటి మార్పు ఉండదని వైట్ హౌస్ ప్రకటన
ఇదిలా ఉండగా ఈ నెల 7న బైడెన్ ఢిల్లీకి రానున్నారు. ఈ నెల 8న భారత ప్రధాని మోదీతో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొంటారు. ఇక 9,10 వ తేదీల్లో జరగనున్న జీ-20 దేశాధినేతల సదస్సులో పాల్గొంటారు. ఆ తర్వాత ఆయన నేరుగా వియత్నాం వెళతారు. జీ20 సదస్సుకు ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, జర్మనీ, బ్రిటన్, జపాన్ సహా వివిధ దేశాధినేతలు హాజరవుతారు. సదస్సు ముగింపు కార్యక్రమంలో జీ20 అధ్యక్ష బాధ్యతలను ప్రధాని మోదీ బ్రెజిల్ అధ్యక్షుడికి అప్పగిస్తారు.