ఏడు వసంతాల జియో.. ప్రీపెయిడ్ ప్లాన్లపై అదనపు ఉచిత డేటా

  • మూడు ప్రీపెయిడ్ ప్లాన్లలో అదనంగా డేటా
  • రూ.299, రూ.749, రూ.2,999 రీచార్జ్ ప్లాన్లు
  • మెక్ డొనాల్డ్, రిలయన్స్ డిజిటల్ వోచర్లు
రిలయన్స్ జియో ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కొన్ని రకాల ప్రీపెయిడ్ ప్లాన్లపై అదనపు ఉచిత డేటాను ఆఫర్ చేస్తోంది. ఈ వివరాలను కంపెనీ తన అధికారిక వెబ్ సైట్లో అందుబాటులో ఉంచింది. రూ.299 ప్లాన్ లో రోజువారీ 2జీబీ ఉచిత డేటాను పొందొచ్చు. ఉచిత వాయిస్ కాల్స్, రోజూ 100 ఎస్ఎంఎస్ లు కూడా పొందొచ్చు. దీనికి అదనంగా 7జీబీ డేటాను ఉచితంగా ఇస్తోంది. ఈ ప్లాన్ కాల వ్యవధి 28 రోజులు.

ఇక రూ.749 ప్లాన్ లో రోజువారీ 2జీబీ ఉచిత డేటా, ఉచిత వాయిస్ కాల్స్, రోజువారీ 100 ఉచిత ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. వీటితోపాటు 14జీబీ డేటా అదనంగా లభిస్తోంది. దీని గడువు 90 రోజులు. రూ.2,999 ప్లాన్ ఏడాది వ్యాలిడిటీతో వస్తోంది. ఇందులో రోజువారీ 2.5 జీబీ ఉచిత డేటా, 100 ఉచిత ఎస్ఎంఎస్ లు, ఉచిత వాయిస్ కాల్స్ లభిస్తాయి. వీటికి అదనంగా 21జీబీ ఉచిత డేటాను యాక్సెస్ చేసుకోవచ్చు. దీనికి మెక్ డొనాల్డ్ మీల్ పై ఆఫర్ ఉంది. రిలయన్స్ డిజిటల్ కొనుగోళ్లపై 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చు.

Jio
free data
benefits
7 years

More Telugu News