Hyderabad: తెలంగాణలో భారీ వర్షాలు..హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు

  • హైదరాబాద్ సహా పలు జిల్లాలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తూ కలెక్టర్ల ఆదేశాలు 
  • హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ
  • నేడు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక
Schools declared holiday in hyderabad on account of heavy rains

తెలంగాణలో పలు ప్రాంతాలను భారీ వర్షం అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం నేడు హైదరాబాద్ సహా పలు జిల్లాలలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చేశారు. 

ఇక మంగళవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్, 17 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 

రెడ్ అలర్ట్ జారీ అయిన జిల్లాలు: హైదరాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి.

ఆరెంజ్ అలర్ట్: జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, వరంగల్, హనుమకొండ. 

ఎల్లో అలర్ట్: అదిలాబాద్, కుమురం భీం, జోగులాంబ, గద్వాల, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, నాగర్‌కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, వనపర్తి.

More Telugu News