కాంగ్రెస్‌లో షర్మిల పార్టీ విలీనంపై కేసీ వేణుగోపాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
- సోనియా, రాహుల్ గాంధీలను షర్మిల కలిశారన్న వేణుగోపాల్
- వారి మధ్య స్నేహపూర్వక భేటీ జరిగిందని వెల్లడి
- వైఎస్సార్ తెలంగాణ పార్టీ విలీనంపై వేచి చూడాలని వ్యాఖ్య
కాగా, షర్మిల గత నెల 31న సోనియా గాంధీతో భేటీ అయ్యారు. తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసే అంశంపై ఆమె చర్చించినట్లుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత షర్మిల మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోనియాతో నిర్మాణాత్మక చర్చలు జరిగాయన్నారు. ఈ నేపథ్యంలో షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసే దిశగా వెళ్తోందనే ప్రచారం సాగుతోంది.