తండ్రి అయిన జస్ప్రీత్ బుమ్రా
- మగ శిశువుకు జన్మనిచ్చిన సంజనా గణేశన్
- ట్విట్టర్ లో విషయాన్ని ప్రకటించిన బుమ్రా
- తమ హృదయాలు నిండుదనాన్ని సంతరించుకున్నాయంటూ పోస్ట్
‘‘మా చిన్న కుటుంబం పెద్దగా మారింది. మా హృదయాలు నిండుదనాన్ని సంతరించుకున్నాయి. ఈ ఉదయం మేము మా చిన్నారి బాలుడిని (అంగద్ జస్ప్రీత్ బుమ్రా) ఈ ప్రపంచంలోకి ఆహ్వానం పలికాం. మేం ఆనందడోలికల్లో విహరిస్తున్నాం. మా జీవితంలో ఈ కొత్త అధ్యాయం గురించి మరింత వేచి చూడలేం’’ అంటూ జస్ప్రీత్ బుమ్రా పోస్ట్ పెట్టాడు. తమ కుమారుడి చేతి పక్కనే బుమ్రా దంపతులు చేతులు ఉంచి తీసిన ఫొటోను పంచుకున్నాడు.