తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన తమన్నా
- వివాహ వ్యవస్థపై తనకు నమ్మకం ఉందన్న తమన్నా
- ప్రస్తుతం తనకు పెద్ద ఆఫర్లు వస్తున్నాయని వెల్లడి
- పెళ్లి ఆలోచనకు ముగింపు పలికానని వ్యాఖ్య
తాజాగా తన పెళ్లి గురించి తమన్నా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. భారతీయ వివాహ వ్యవస్థపై తనకు ఎంతో నమ్మకం ఉందని తెలిపింది. పెళ్లి చేసుకోవాలని కొన్నాళ్ల క్రితం అనుకున్నానని... అయితే, కెరీర్ బిజీగా మారడంతో పెళ్లి ఆలోచనకు ముగింపు పలికానని చెప్పింది. ప్రస్తుతం పెద్ద ఆఫర్లు వస్తున్నాయని... అందువల్ల తన పెళ్లి వార్త వినాలంటే చాలా రోజులు ఎదురు చూడాల్సిందేనని తెలిపింది.