Viral Video: రైలులో మహిళ పర్సు చోరీ.. దొంగను పట్టుకుని కిటికీకి వేలాడదీత.. వీడియో ఇదిగో!

Thief Hangs Outside Window Of Speeding Train
షార్ట్స్‌లో చూడండి
రైలులో ఓ మహిళ పర్సు కొట్టేసిన దొంగ ప్రయాణికులకు దొరికిపోయి కొన్ని కిలోమీటర్ల పాటు కిటికీకి వేలాడాడు. చివరికి ఓ స్టేషన్‌లో అతడిని పోలీసులకు అప్పగించారు. బీహార్‌లోని బెగూసరాయ్ జిల్లాలో జరిగిందీ ఘటన. కటిహార్ నుంచి సమస్తిపూర్ వెళ్తున్న రైలులో మహిళ పర్సును కొట్టేసిన దొంగ పారిపోయే ప్రయత్నంలో ఇతర ప్రయాణికులకు చిక్కాడు. కిటికీలోంచి అతడిని పట్టుకున్నారు. 

ఈ క్రమంలో రైలు కదిలిపోవడంతో అతడు కిందపడకుండా గట్టిగా చేతులు పట్టుకున్నారు. దొరికిపోయిన దొంగ ప్రాణభయంతో ఏడుపు లంకించుకున్నాడు. రైలు కొన్ని కిలోమీటర్ల తర్వాత బచ్వారా జంక్షన్‌లో ఆగడంతో ఆర్పీఎఫ్ పోలీసులకు అతడిని అప్పగించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Go Back to Shorts
Viral Video
Bihar
Begusarai
Thief Hangs Rail Window

More Telugu News