Asia Cup: ఆసియాకప్: కొలంబోలో వారంపాటు భారీ వర్షాలు.. మరో వేదికకు మ్యాచ్‌ల తరలింపు!

  • వచ్చే వారంపాటు కొలంబోలో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ
  • ఈ నెల 9 నుంచి ఐదు సూపర్-4 మ్యాచ్‌లు కొలంబోలోనే
  • దంబుల్లా లేదంటే పల్లెకెలెకు తరలించాలని యోచిస్తున్న ఏసీసీ
  • చర్చలు జరుగుతున్నాయన్న బీసీసీఐ
ACC wants to change venues of super 4 matches to Dambulla from Colombo

ఆసియాకప్‌లో భాగంగా కొలంబోలో జరగాల్సిన మ్యాచ్‌లను మరో వేదికకు తరలించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) నిర్ణయించినట్టు తెలుస్తోంది. వచ్చే వారంపాటు కొలంబోలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అక్కడ జరగాల్సిన సూపర్ ఫోర్ మ్యాచ్‌లను మరో స్టేడియంలో నిర్వహించాలని సూచనప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

ఈ నెల 9 నుంచి ఐదు సూపర్-4 మ్యాచ్‌లు కొలంబోలో జరగాల్సి ఉంది. వర్షాలు కురవనున్నాయన్న హెచ్చరికలతో అప్రమత్తమైన ఏసీసీ వాటిని దంబుల్లాలోకానీ, లేదంటే పల్లెకెలోలో కానీ నిర్వహించాలని యోచిస్తోంది. ఈ విషయమై ఇంకా చర్చలు జరుగుతున్నట్టు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

More Telugu News