తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు మరో శుభవార్త చెప్పిన టీఎస్ఆర్టీసీ

Good News for TSRTC employees
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త. ఉద్యోగులకు మరో విడత డీఏను పెంచుతూ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జనవరి నుంచి పెండింగ్‌లో ఉన్న 5 శాతం డీఏను మంజూరు చేయాలని నిర్ణయించినట్లు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. సెప్టెంబర్ నెల వేతనంతో కలిపి ఈ డీఏను చెల్లించనున్నట్లు వెల్లడించారు.

క్లిష్ట పరిస్థితుల్లోనూ ఇప్పటి వరకు ఎనిమిది డీఏలను మంజూరు చేసినట్లు బాజిరెడ్డి తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులు కష్టపడి పని చేస్తున్నారని, పెండింగ్‌ బకాయిలను త్వరలో ఇవ్వడానికి యాజమాన్యం ప్రయత్నం చేస్తోందన్నారు.
Go Back to Shorts
tsrtc
employees

More Telugu News