వచ్చే మే నెల తరువాత తన బతుకేంటో సజ్జల ఆలోచించుకోవాలి: ధూళిపాళ్ల నరేంద్ర ఘాటు విమర్శలు
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఐటీ నోటీసులపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన తీవ్ర విమర్శలను టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఖండించారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ సీనియర్ క్లర్క్ సజ్జల తన స్థాయికి మించి మాట్లాడుతున్నాడని వ్యాఖ్యానించారు. దానికి కారణం ఒత్తిడి అవ్వొచ్చు... ఫ్రస్ట్రేషన్ అవ్వొచ్చు అని ఎద్దేవా చేశారు.
కారణాలు ఏమైనా... తనది, తన యజమానిది ఇతరుల బతుకుల గురించి మాట్లాడేంత గొప్ప బతుకు కాదని సజ్జల తెలుసుకోవాలని ధూళిపాళ్ల హితవు పలికారు. బిడ్డల దగ్గరకు వెళ్లడానికి కోర్టు అనుమతి పొందాల్సిన నాయకుడి దగ్గర పని చేస్తూ ఇతరుల బతుకుల గురించి మాట్లాతుంటే జనం నవ్వుతున్నారని సజ్జలను ఎత్తిపొడిచారు.
వచ్చే మే నెలలో ఎన్నికల ఫలితాల తరువాత తన బతుకు ఏంటి అనేది కూడా ఈ క్లర్క్ ఒకసారి ఆలోచించుకోవాలని స్పష్టం చేశారు.