Stock Market: సెప్టెంబర్ ను పాజిటివ్ గా ప్రారంభించిన స్టాక్ మార్కెట్లు

  • అంతర్జాతీయ సానుకూలతలతో లాభాల్లో ముగిసిన మార్కెట్లు
  • 556 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 182 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
Markets ends in profits

దేశీయ స్టాక్ మార్కెట్లు సెప్టెంబర్ నెలను పాజిటివ్ గా ప్రారంభించాయి. అంతర్జాతీయంగా ఉన్న సానుకూలతలతో మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 556 పాయింట్లు ఎగబాకి 65,387కి పెరిగింది. నిఫ్టీ 182 పాయింట్లు పుంజుకుని 19,435కి చేరుకుంది. మెటల్, టెలికాం, పవర్, ఇన్ఫ్రా సూచీలు మార్కెట్లను ముందుండి నడిపించాయి. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్: 
ఎన్టీపీసీ (4.84%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (3.37%), టాటా స్టీల్ (3.33%), మారుతి (3.24%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (3.07%). 

టాప్ లూజర్స్:
అల్ట్రాటెక్ సిమెంట్ (-0.50%), సన్ ఫార్మా (-0.34%), నెస్లే ఇండియా (-0.26%), ఎల్ అండ్ టీ (-0.17%).

More Telugu News