సమాజానికి తుమ్మల నాగేశ్వరరావు అవసరం ఉంది: రేవంత్ రెడ్డి

  • తుమ్మలను కలిసిన రేవంత్
  • కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానం
  • కేసీఆర్ ను కొట్టేందుకు అందరం ఏకమవుతున్నామన్న రేవంత్
  • తుమ్మల రాష్ట్ర  స్థాయిలో ప్రభావం చూపగల నేత అని కితాబు
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో భేటీ అనంతరం మాట్లాడారు. కేసీఆర్ ను ఎదుర్కొనేందుకు అందరం ఏకమవుతున్నామని అన్నారు. సమాజానికి తుమ్మల నాగేశ్వరరావు వంటి నేతల అవసరం ఉందని తెలిపారు. అందుకే ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించామని వెల్లడించారు. 

తుమ్మల ఖమ్మం జిల్లానే కాదు... రాష్ట్రస్థాయిలో ప్రభావం చూపగల వ్యక్తి అని కొనియాడారు. తుమ్మలను రాజకీయాల్లో లేకుండా చేయాలని పాలేరు శాసనసభ్యుడు ఉపేందర్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఉపేందర్ రెడ్డి అవినీతిలో కూరుకుపోయాడని రేవంత్ వ్యాఖ్యానించారు.

Revanth Reddy
Tummala Nageswara Rao
Congress
BRS
Telangana

More Telugu News