Nara Lokesh: అదే నాలో కసి రగిల్చింది: నారా లోకేశ్ ప్రత్యేక సందేశం

  • 200 కి.మీ పూర్తి చేసుకున్న యువగళం
  • పోలవరం నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర
  • ప్రజలే తనను ముందుండి నడిపిస్తున్నారన్న లోకేశ్
  • ఈ పాదయాత్ర తనకు జగమంత కుటుంబాన్ని ఇచ్చిందని వెల్లడి
Nara Lokesh special message on 200th day of his Yuvagalam Padayatra

టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక సందేశం వెలువరించారు. ప్రస్తుతం లోకేశ్ పాదయాత్ర పోలవరం నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా తన పాదయాత్ర ప్రస్థానాన్ని గుర్తుచేసుకున్నారు. 

"ప్రజ‌ల కోసం, రాష్ట్ర ప్రగ‌తి కోసం, యువ‌త కోసం, జ‌నం భ‌విత కోసం యువ‌గ‌ళ‌మై నేను ముంద‌డుగు వేశాను. ప్రజ‌లే న‌న్ను ముందుండి న‌డిపిస్తున్నారు. యువ‌గ‌ళం పాద‌యాత్రలో ప‌డుతున్న నా అడుగులు... అరాచ‌క వైసీపీ స‌ర్కారు గుండెల్లో పిడుగులు. నా పాద‌యాత్ర‌... జ‌న‌చైత‌న్య యాత్ర‌గా మారింది. యువ‌గ‌ళం... ప్రజాగ‌ళమై నిన‌దిస్తోంది. 

నాలుగేళ్ల సైకో జ‌గ‌న్ పాల‌న జ‌నం పాలిట ఎంత‌ న‌ర‌కంగా ఉందో ప్రత్యక్షంగా చూశాను. స‌క‌లవ‌ర్గాలూ వైసీపీ కాల‌కేయుల బాధితులే! 200 రోజులు, 2,700 కి.మీ. పాద‌యాత్ర నాకు జ‌గ‌మంత కుటుంబాన్ని ఇచ్చింది. ఏ ఊరు వెళితే, ఆ ఊరువాడిగా ఆద‌రించారు. ఏ వాడ‌లో ఉంటే, ఆ వాడ మ‌నిషిని చేసుకున్నారు. ప‌ల్లెలు ఆప్యాయంగా ప‌ల‌క‌రించాయి. ప‌ట్టణాలు అభిమానంతో స్వాగ‌తించాయి. కుల‌, మ‌త‌, ప్రాంతాల‌కు అతీతంగా యువ‌గ‌ళం జ‌నబ‌ల‌మైంది. 

అంద‌రి స‌మ‌స్యలూ ద‌గ్గరుండి చూశాను. అభివృద్ధికి దూర‌మై, అరాచ‌కంతో ధ్వంస‌మైన రాష్ట్ర దుస్థితి నాలో క‌సి ర‌గిల్చింది. భుజం నొప్పి బాధిస్తోంది, ప్రజ‌లు ప‌డుతున్న బాధ‌ల కంటే ఎక్కువేం కాదు. కాళ్లు బొబ్బలెక్కాయి, జ‌నం క‌ష్టాల క‌న్నీళ్ల కంటే నొప్పి ఏమీ లేదు. చేతులు ర‌క్కుకుపోయాయి, వైసీపీ దాడుల‌తో ర‌క్తమోడుతున్న వారి కంటే ఇది క‌ష్టమేం కాదు. 

యువ‌గ‌ళంతో జ‌న‌గ‌ళం క‌లిసింది... కోట్లాది గొంతుక‌లు ఒక్కటై సైకో పోవాలి-సైకిల్ రావాలి అని నిన‌దిస్తున్నాయి. ల‌క్షలాది మంది ఫోటోలు దిగారు, వేలాది మంది త‌మ స‌మ‌స్యలు తెలియ‌జేశారు, జ‌న‌సంద్రంలో కొంద‌రిని క‌ల‌వ‌లేక‌పోయాను. కొంద‌రి విన‌తులు అందుకోలేక‌పోయి ఉండొచ్చు. పెద్ద మ‌న‌సుతో మ‌న్నించండి. వేలాది విన‌తులు వ‌చ్చాయి. అన్నింటికీ ప‌రిష్కారం చూపించే చంద్రన్న ప్రభుత్వం వ‌స్తుంది. 

వైసీపీ రాక్షస మూక‌లు అడ్డంకులు క‌ల్పించినా, వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు అనుకూలించ‌క‌పోయినా... నిద్రాహారాలు మాని యువ‌గ‌ళం గ‌మ్యం వైపు నా వెంట న‌డుస్తున్న మీ అంద‌రి త్యాగం వృథా పోదు. 

నా యువ‌గ‌ళం పాద‌యాత్ర నిర్విరామంగా, నిరాఘాటంగా కొన‌సాగ‌డానికి కృషి చేస్తోన్న ప్రజ‌లు, టీడీపీ నేత‌లు, కార్యక‌ర్తలు, అభిమానులు, యువ‌గ‌ళం క‌మిటీలు, వ‌లంటీర్లు, వైద్యసిబ్బంది, మీడియాకి శిర‌స్సు వంచి న‌మ‌స్కరిస్తున్నాను" అంటూ వినమ్రంగా స్పందించారు.

More Telugu News