తమిళనాడుకు కావేరీ జలాలు.. రాత్రంతా ఆందోళన చేసిన కర్ణాటక రైతులు
- తమిళనాడుకు 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాాలన్న 'కావేరీ వాటర్ రెగ్యులేషన్ కమిటీ'
- తీవ్రంగా నిరసిస్తున్న కర్ణాటక రైతులు
- సమస్య పరిష్కారం కోసం రేపు ఢిల్లీ వెళ్లనున్న డిప్యూటీ సీఎం శివకుమార్
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాత్రం నీళ్లు ఇవ్వలేమని, తమ రిజర్వాయర్లు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని, అదే జరిగితే తాగునీటికి ఇబ్బందులు తప్పవని ఆందోళన వ్యక్తం చేశారు. 3 వేల క్యూసెక్కులకు మించి ఇవ్వలేమని శివకుమార్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే సమస్య పరిష్కారం కోసం ఆయన ఢిల్లీ పయనమవుతున్నారు. కావేరీ జలాల కోసం కర్ణాటక-తమిళనాడు మధ్య దశాబ్దాలుగా వివాదం కొనసాగుతూనే ఉంది. దీంతో సమస్య పరిష్కారం కోసం 1990లో కేంద్ర ప్రభుత్వం ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేసింది.