నా పని ఇప్పుడే అయిపోయిందని భావించవద్దు: ఎమ్మెల్యే రాజయ్య వ్యాఖ్యలు
- టిక్కెట్ రాకపోయినా ప్రజాక్షేత్రంలోనే ఉంటానన్న ఎమ్మెల్యే
- ఎన్నికలకు మరో మూడు నెలల సమయం ఉందని కీలక వ్యాఖ్య
- ఎవరో వచ్చి ఏదో చేస్తారని అనుకోవద్దని హితవు
- ఏదో జరుగుతుందని ఊహించవద్దన్న రాజయ్య
ఇటీవల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 119 నియోజకవర్గాలకు గాను 115 మంది అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం ఏడు స్థానాల్లో అభ్యర్థులను మార్చారు. అందులో స్టేషన్ ఘన్ పూర్ కూడా ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యను కాదని కడియం శ్రీహరికి టిక్కెట్ కేటాయించారు. దీంతో రాజయ్య తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అయినప్పటికీ తాను కేసీఆర్ వెంటే నడుస్తానని ఆయన ప్రకటించడం గమనార్హం.