మోదీ చెబుతున్నది అబద్ధమని చాలా రోజులుగా చెబుతున్నా.. అది నిజమైంది: రాహుల్‌గాంధీ
- చైనా మ్యాప్‌పై ప్రధాని ఏదో ఒకటి మాట్లాడాలన్న రాహుల్ గాంధీ
- చైనా మన భూమిని లాక్కుందన్న కాంగ్రెస్ నేత
- చైనాకు ఇలాంటి అలవాటేనన్న విదేశాంగ మంత్రి
చైనా సోమవారం కొత్త ఎడిషన్ ‘స్టాండర్డ్ మ్యాప్’ను విడుదల చేసింది. అందులో అరుణాచల్‌ప్రదేశ్, అక్సాయ్ చిన్ ప్రాంతంతోపాటు తైవాన్, వివాదాస్పద సౌత్ చైనా సముద్రాన్ని తనవిగా చూపించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం తీవంగ్రా స్పందించింది. బీజింగ్‌పై తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. చైనాకు ఇలాంటివి అలవాటుగా మారిందని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ విమర్శించారు.