మధ్య తరగతి ప్రజలకు ఈ నిర్ణయం ఓ వరం: గ్యాస్ ధర తగ్గింపుపై విజయసాయిరెడ్డి
- గ్యాస్ సిలిండర్ ధర తగ్గించిన కేంద్రం
- సాధారణ సిలిండర్ పై రూ.200 తగ్గింపు
- ఉజ్వల్ పథకం సిలిండర్లపై రూ.400 తగ్గింపు
- కోట్లాది మంది ప్రజలకు డబ్బును ఆదా చేస్తుందన్న విజయసాయి
దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. గృహ వినియోగదారులు ఉపయోగించే ఎల్పీజీ సిలిండర్ల ధరను రూ.200 మేర తగ్గించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయాన్ని వైసీపీ స్వాగతిస్తోందని తెలిపారు.
మోదీ తీసుకున్న ఈ నిర్ణయం కోట్లాది మంది ప్రజలకు డబ్బును ఆదా చేస్తుందని, ఆ డబ్బును ఇతర అవసరాలకు ఉపయోగించుకునేలా ఈ నిర్ణయం తోడ్పడుతుందని విజయసాయి వివరించారు. పెద్ద సంఖ్యలో ఉన్న మధ్య తరగతి ప్రజలకు ఈ నిర్ణయం ఓ వరంలాంటిదని అభివర్ణించారు.