రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో ఫోన్లను నిషేధించిన ఏపీ ప్రభుత్వం
- విద్యార్థులు స్కూళ్లకు ఫోన్లను తీసుకురాకూడదని ఉత్తర్వులు
- ఉపాధ్యాయులు తరగతి గదుల్లోకి ఫోన్లను తీసుకురాకూడదని ఆదేశాలు
- నిబంధనలు ఉల్లంఘించే ఉపాధ్యాయులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక
బోధనకు ఎలాంటి ఆటంకం రాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఉపాధ్యాయ సంఘాలు, ఇతర వర్గాలతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. నిబంధనలు ఉల్లంఘించే ఉపాధ్యాయులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా ప్రధానోపాధ్యాయులు, ఉన్నతాధికారులు చూడాలని ఆదేశించింది.