కాలేజీ బస్సు ఢీ కొట్టడంతో జీహెచ్ఎంసీ స్వీపర్ మృతి.. వీడియో ఇదిగో!
- రాంకోఠిలో సోమవారం ఉదయం ప్రమాదం
- మరో నలుగురు విద్యార్థులకు గాయాలు
- స్వీపర్ కుటుంబాన్ని ఆదుకుంటామన్న మేయర్
ఈ ప్రమాదంలో చెట్టుకు, బస్సుకు మధ్యలో నలిగి సునీత అక్కడికక్కడే చనిపోయింది. మరో నలుగురు విద్యార్థినులు కూడా గాయపడ్డారు. ఈ ప్రమాదంతో రాంకోఠిలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బస్సు డ్రైవర్ మహ్మద్ గౌస్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, అతడిపై కేసు నమోదు చేశామని నారాయణగూడ పోలీసులు తెలిపారు. ప్రమాదంపై విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. కాగా, ఈ ప్రమాదంపై జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి స్పందించారు. స్వీపర్ సునీత మృతిపై విచారం వ్యక్తం చేసిన మేయర్.. సునీత కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.