కేసీఆర్‌కే ఓటేస్తామని కామారెడ్డిలో 10 గ్రామపంచాయతీల తీర్మానం
- ఏకగ్రీవ తీర్మానం చేసిన మాచారెడ్డి మండలంలోని గ్రామాలు
- తీర్మానానికి సంబంధించిన ప్రతులను కవితకు అందించిన మండల నాయకులు
- కేసీఆర్‌కు కామారెడ్డి ప్రజలు పట్టం కడతారన్న ఎమ్మెల్సీ కవిత
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ... కేసీఆర్‌కు మాత్రమే ఓటేస్తామని తీర్మానం అద్భుతమన్నారు. షబ్బీర్ అలీ వంటి కాంగ్రెస్ నేతలు ఎన్ని మాట్లాడినా కేసీఆర్‌కు కామారెడ్డి ప్రజలు పట్టం కడతారని చెప్పారు. కామారెడ్డిలోని అన్ని గ్రామాల ప్రజలు కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారన్నారు. స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ విజ్ఞప్తి మేరకే కేసీఆర్ కామారెడ్డిలోనూ పోటీ చేయాలని నిర్ణయించారన్నారు.