డాక్టర్ రాలేదని నర్సు సిజేరియన్ ఆపరేషన్.. శిశువు మృతి!
- జనగామ జిల్లా పాలకుర్తి సామాజిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం ఘటన
- మహిళకు పురిటినొప్పులు, విధుల్లో ఉండాల్సిన వైద్యురాలు అందుబాటులో లేని వైనం
- గర్భవతికి స్టాఫ్ నర్సు సిజేరియన్ ఆపరేషన్, చలనం లేకుండా పుట్టిన బిడ్డ
- శిశువును జిల్లా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యుల నిర్ధారణ
- గురువారం బాధితులు ఆసుపత్రి వద్ద పెద్ద ఎత్తున నిరసన
- బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సూపరింటెండెంట్ హామీతో నిరసన విరమణ
మరోవైపు, యువతికి అర్ధరాత్రి నొప్పులు తీవ్రమయ్యాయి. ఆ సమయంలో డ్యూటీలో ఉండాల్సిన డాక్టర్ అక్కడ లేకపోవడంతో స్టాఫ్ నర్సు సరిత, ఇతర సిబ్బంది సాయంతో మహిళకు సిజేరియన్ చేయగా ఆడ శిశువు జన్మించింది. అయితే, బిడ్డలో చలనం లేకపోవడంతో వెంటనే జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే శిశువు మృతి చెందినట్టు అక్కడి వైద్యులు ప్రకటించారు.
నర్సు సిజేరియన్ చేయడం వల్లే బిడ్డ మృతి చెందిందంటూ గురువారం బాధితులు పాలకుర్తిలో ఆసుపత్రి వద్ద ప్రజాసంఘాలతో కలిసి ధర్నాకు దిగారు. వైద్యురాలు, స్టాఫ్ నర్సును విధుల నుంచి తక్షణం తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్య విధాన పరిషత్ పర్యవేక్షకుడు బాధితులతో మాట్లాడి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. శిశువు తండ్రి ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించడంతో బాధితులు ఆందోళన విరమించారు.