తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది!
- తిరుమలలో రద్దీ సాధారణం
- ఏడు కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు
- సర్వదర్శనానికి 15 గంటల సమయం
- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం
- బుధవారం ఒక్కరోజే హుండీ ద్వారా రూ.3.76 కోట్ల ఆదాయం
శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. బుధవారం నాడు తిరుమల శ్రీవారిని 71,122 మంది దర్శించుకున్నారు. 29,121 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. బుధవారం ఒక్కరోజే హుండీ ద్వారా రూ.3.76 కోట్ల ఆదాయం వచ్చింది.