Allu Arjun: షాక్‌లో ఉన్నాను... తర్వాత మాట్లాడతాను: అవార్డ్‌పై అల్లు అర్జున్ ఫస్ట్ రియాక్షన్

Allu Arjun about national award as best actor
షార్ట్స్‌లో చూడండి
'షాక్‌లో ఉన్నాను.. తర్వాత మాట్లాడతాను'. తనకు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు రావడంపై ఇదీ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్పందన! 69వ జాతీయ సినిమా అవార్డులను గురువారం ప్రకటించారు. దాదాపు ఏడు దశాబ్దాలుగా తెలుగుకు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు రాలేదు. 69వ ఏడాది అల్లు అర్జున్ ద్వారా టాలీవుడ్‌కు ఈ గౌరవం దక్కింది! తనకు ఈ అవార్డు రావడంపై మీ స్పందన ఏమిటని మీడియా ప్రశ్నించింది. తొలుత చేతి సైగలతో తర్వాత మాట్లాడతానంటూ చెప్పారు. ఆ తర్వాత మళ్లీ మళ్లీ అడగడంతో అల్లు అర్జున్ పైవిధంగా స్పందించారు. 

అవార్డు రావడంతో ఆయన ఇంటికి సినీ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చి, అభినందనలు చెప్పారు. అవార్డు ప్రకటన తర్వాత అల్లు అర్జున్, తండ్రి అల్లు అరవింద్ తదితరులు ఇంటి బయటకు వచ్చారు. ఈ సమయంలో మీడియా అతనిని ప్రశ్నించింది. తాను షాక్‌లో ఉన్నానని, తర్వాత మాట్లాడతానని చెప్పారు. ఆ తర్వాత మాట్లాడిన అల్లు అరవింద్ గర్వంగా ఉందని తెలిపారు.
Go Back to Shorts
Allu Arjun
national award
Tollywood

More Telugu News