అల్లు అర్జున్ బావా, కంగ్రాట్స్... అంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్
- జాతీయ ఉత్తమ నటుడి అవార్డు నేపథ్యంలో అల్లు అర్జున్‌కు అభినందనల వెల్లువ
- అభినందనలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్
- పుష్ప సినిమాలో నటనకు ఈ అవార్డుకు అర్హుడివంటూ కితాబు
అల్లు అర్జున్ బావా.. కంగ్రాచ్యులేషన్స్, పుష్ప సినిమాకు గాను ఈ అవార్డుకు నీవు అర్హుడివి అంటూ ట్వీట్ చేశారు. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలిచిన ఉప్పెన టీమ్‌కు, ఉత్తమ నటి అవార్డు దక్కించుకున్న అలియాభట్‌కూ తారక్ అభినందనలు తెలిపారు. ఆర్ఆర్ఆర్ సినిమా ఆరు జాతీయ అవార్డులు దక్కించుకుంది. అవార్డులు దక్కించుకున్న వారితో పాటు సినిమా బృందానికి కూడా ఆయన అభినందనలు తెలిపారు.