చంద్రయాన్-3కి సాయపడ్డ ప్రైవేటు కంపెనీల షేర్లకు రెక్కలు
- ప్రైవేటు రంగంపై చంద్రయాన్-3 విజయంతో సానుకూల ప్రభావం
- ఈ మిషన్‌లో కీలక పాత్ర పోషించిన సెంటమ్, స్పేస్ టెక్నాలజీస్ సంస్థ షేర్ల లాభాల బాట
- చంద్రయాన్-3 బూస్టర్ భాగాలను సరఫరా చేసిన ఎల్ అండ్ టీ
- ఎలక్ట్రానిక్ వస్తువులను సరఫరా చేసిన సెంటమ్ ఎలక్ట్రానిక్స్
చంద్రయాన్-3కి కీలకమైన క్రిటికల్ బూస్టర్ భాగాలను ఎల్ అండ్ టీ సరఫరా చేసింది. ల్యాండర్, ప్రొపల్షన్ మాడ్యూల్స్‌లోని బ్యాటరీలను భేల్ తయారు చేసింది. ఎమ్‌టార్ టెక్నాలజీస్ చంద్రయాన్-3కి అవసరమైన ఇంజన్లు, బూస్టర్ పంపులను అందించింది. మిధానీ కీలక లోహ మిశ్రమాలను చంద్రయాన్-3 కోసం సిద్ధం చేసింది. చంద్రయాన్-3లో వినియోగించిన పలు ఎలక్ట్రానిక్ వస్తువులను సెంటమ్ ఎలక్ట్రానిక్స్ సరఫరా చేసింది. హిందుస్థాన్ ఎయిరోనాటిక్స్, పరాస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్, వాల్‌చందర్ ఇండస్ట్రీస్‌తో పాటూ గోద్రేజ్ కంపెనీ, గోద్రేజ్ ఎయిరోస్పేస్ కూడా చంద్రయాన్-3కి కావాల్సిన పలు కీలక విడిభాగాలను సరఫరా చేశాయి.