Balakrishna: ఒకే వేదికపైకి చిరంజీవి, బాలకృష్ణ?.. మోగా, నందమూరి ఫ్యాన్స్ కు పండగే!

Chiranjeevi in Balakrishna Unstoppable show
షార్ట్స్‌లో చూడండి
సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షో ఎంతటి ప్రేక్షకాదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఈ షో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఎంతో మంది సెలబ్రిటీలతో తన షో ద్వారా ఎన్నో ఆసక్తికర విషయాలను బాలయ్య చెప్పించారు. టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఈ షోకు హాజరై పలు విషయాలపై స్పందించారు. పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, ప్రభాస్ తదితర స్టార్లను బాలయ్య ఇంటర్వ్యూ చేశారు. 

తాజాగా ఈ షోకు సంబంధించి ఓ వార్త వైరల్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి ఈ షోకు హాజరవుతున్నారనేదే ఆ వార్త. టాలీవుడ్ లో అగ్రనటులైన చిరంజీవి, బాలకృష్ణ ఒకే వేదికపై కనిపిస్తే ఇక ప్రేక్షకులకు పండగే అని చెప్పడం అతిశయోక్తి కాదు. ఒకవేళ చిరంజీవి ఈ షోకు హాజరైతే... ఆయనకు బాలయ్య ఎలాంటి ప్రశ్నలు వేస్తారు? ఎలాంటి సరికొత్త విషయాలను ఆయనతో చెప్పిస్తారు? అనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. 

Go Back to Shorts
Balakrishna
Telugudesam
Chiranjeevi
Tollywood

More Telugu News