యూట్యూబ్ లో వీడియో చూస్తూ కాన్పు చేసిన భర్త.. భార్య దుర్మరణం
- తమిళనాడు కృష్ణగిరి జిల్లా హనుమంతపురంలో ఘటన
- సహజపద్ధతిలో ప్రసవం జరగాలనుకున్న భార్యాభర్తలు
- యూట్యూబ్ లో వీడియో చూసి భార్యకు కాన్పు చేసిన భర్త
- మగబిడ్డకు జన్మనిచ్చిన కాసేపటికి మహిళకు తీవ్ర రక్తస్రావం
- ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యుల ప్రకటన
ఇటీవల లోకనాయకి గర్భం దాల్చింది. దీంతో, వారు ప్రసవం కూడా సహజపద్ధతిలో జరగాలని నిర్ణయించుకున్నారు. అది మొదలు మాదేశ్ యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూ ప్రసవం ఎలా చేయాలనే విషయంపై అవగాహన పెంచుకునేవాడు. మంగళవారం లోకనాయకికి నొప్పులు మొదలవడంతో మాదేశ్ తన యూట్యూబ్ జ్ఞానంతో ఆమెకు ప్రసవం చేశాడు. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన లోకనాయకికి ఆ తరువాత తీవ్ర రక్తస్రావమైంది. దీంతో, కంగారు పడిపోయిన మాదేశ్ ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆమె అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ప్రకటించారు.