ఈ క్షణం కోసం ఎదురుచూపు: నాడు కన్నీళ్లు పెట్టుకున్న ఇస్రో మాజీ చైర్మన్ శివన్
- చంద్రయాన్-3 విజయవంతం కావడంపై ఇస్రో మాజీ చైర్మన్ హర్షం
- ఇది చాలా స్వీట్ న్యూస్ అన్న శివన్
- చంద్రయాన్-3 పంపించే సైన్స్ డేటా ప్రపంచ శాస్త్రవేత్తల కోసమని వెల్లడి
అద్భుత విజయం సాధించినందుకు గాను దేశ ప్రజలందరికీ అభినందనలు తెలిపారు. ప్రభుత్వం కూడా సహకరించినట్లు చెప్పారు. చంద్రయాన్-3 పంపించే సైన్స్ డేటా ఒక్క భారత్ కోసమే కాదని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలందరి కోసం అన్నారు. ఈ డేటా ద్వారా ప్రపంచ సైంటిస్ట్‌లు కొత్త విషయాలు కనుగొనేందుకు ఉపయోగపడుతుందన్నారు. చంద్రయాన్-3 ప్రయోగంలో ప్రపంచ ప్రయోజనాలు ఉన్నాయన్నారు. కాగా, 2019లో చంద్రయాన్-2 ల్యాండర్ విజయానికి అడుగు దూరంలో కుప్పకూలింది. దీంతో నాటి ఇస్రో చైర్మన్ శివన్ కన్నీళ్లు పెట్టుకోగా, ప్రధాని మోదీ ఓదార్చారు.