శామీర్ పేట్ లో బస్సు దగ్ధం.. యువకుడి మృతి
- బైక్ ఢీ కొట్టడంతో పెట్రోల్ లీక్ అయి ఎగిసిపడ్డ మంటలు
- బస్సులోని ప్రయాణికులు సేఫ్.. బైకర్ సజీవదహనం
- జీనోమ్ వ్యాలీ సమీపంలో మంగళవారం ఉదయం దుర్ఘటన
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్ పేట్ మండలంలోని జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సులో ప్రయాణించిన ఉద్యోగులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూజే ఫార్మా కంపెనీ ఉద్యోగి సంపత్ విధులకు హాజరయ్యేందుకు బైక్ పై వెళుతున్నాడు. కొల్తూరు వద్ద బైక్ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఫార్మా కంపెనీ బస్సును ఢీ కొట్టాడు. దీంతో బైక్ తో సహా కిందపడ్డాడు. అదే సమయంలో పెట్రోల్ ట్యాంక్ లీక్ కావడంతో మంటలు ఎగసిపడ్డాయి. దీంతో బైక్, బస్సు రెండూ కాలిపోయాయి. మంటల్లో చిక్కుకున్న సంపత్ కూడా స్పాట్ లోనే చనిపోయాడు. కాగా, సంపత్ స్వస్థలం సిద్దిపేట జిల్లా ములుగు మండలం వరదరాజపురం అని పోలీసులు తెలిపారు.