Chiranjeevi: ‘బింబిసార’ దర్శకుడితో మెగాస్టార్ సినిమా.. ఇదిగో పోస్టర్

chiranjeevi upcoming movies with gold box entertainment and uv creations details
  • ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న చిరంజీవి
  • ఆయన నటిస్తున్న సినిమాలపై ప్రకటనలు
  • యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌‌పై మెగాస్టార్ చిత్రం
  • సోషియో ఫ్యాంటసీ కథను సిద్ధం చేసిన వశిష్ఠ
  • ‌గోల్డ్ బాక్స్ ఎంటర్‌‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌‌పై మరో సినిమా
మెగాస్టార్ చిరంజీవి ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు సినీ రాజకీయ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఆయన నటిస్తున్న రెండు సినిమాలకు సంబంధించిన ప్రకటనలు కూడా వచ్చేశాయి. యువీ క్రియేషన్స్ బ్యానర్‌‌లో ఒక సినిమా, గోల్డ్ బాక్స్‌ ఎంటర్‌‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో మరో చిత్రంలో చిరు నటిస్తున్నారు. 

చిరంజీవి 157వ సినిమాను యూవీ సంస్థ తెరకెక్కించనుంది.‘బింబిసార’ వంటి సోషియో ఫాంటసీ చిత్రాన్ని రూపొందించిన వశిష్ఠ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం కూడా సోషియో ఫాంటసీ నేపథ్యంలోనే ఉండనున్నట్లు పోస్టర్‌‌ ద్వారా తెలుస్తోంది. మెగాస్టార్ కోసం పంచభూతాలు ఏకం కానున్నాయంటూ యూవీ సంస్థ ట్వీట్ చేసింది. ‘ఈ సారి విశ్వానికి మించి’ అని ఇచ్చిన క్యాప్షన్ కూడా ఆసక్తికరంగా ఉంది. చిరంజీవి కోసం వశిష్ఠ ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించనున్నట్లు తెలుస్తోంది.  

మరోవైపు తన కుమర్తె సుస్మిత సొంత బ్యానర్‌లోనూ చిరంజీవి నటిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రకటన కూడా ఈ రోజు వచ్చింది. 156వ సినిమాను చిరంజీవి తమ బ్యానర్‌‌లో చేస్తున్నారని తెలియజేయడానికి సంతోషంగా ఉందంటూ గోల్డ్ బాక్స్ ఎంటర్‌‌టైన్‌మెంట్స్‌ ట్వీట్ చేసింది. ‘‘నాలుగు దశాబ్దాలుగా వెండితెరను శాసిస్తున్న రాజసం.. తెరపైనే కాకుండా బయట కూడా బంధాలకు విలువ ఇచ్చే వ్యక్తి.. ‘మెగా 156’ సినిమాను మా బ్యానర్‌‌లోనే చేస్తున్నారు” అని పేర్కొంది. ఈ మేరకు ఓ పోస్టర్‌‌ను కూడా షేర్ చేసింది. అయితే దర్శకుడు ఎవరన్నది వెల్లడించలేదు.
Chiranjeevi
MEGA STAR
UV Creations
bimbisara
gold box entertainments

More Telugu News