అమావాస్య రోజు అప్రమత్తంగా ఉండండి.. యూపీ పోలీసులకు డీజీపీ ఆదేశాలు
- ఇంటర్నల్ సర్క్యులర్ జారీ చేసిన డీజీపీ
- అమావాస్య రోజున దొంగలు చురుగ్గా ఉంటారని హెచ్చరిక
- అమావాస్యకు వారం ముందు, తర్వాత వారం రోజులు నైట్ పెట్రోలింగ్ పెంచాలని ఆదేశాలు
ఆగస్టు 14న జారీ చేసిన ఈ సర్క్యులర్‌కు పంచాంగం కాపీని కూడా జత చేశారు. అమావాస్య రోజుల్లో నైట్ పెట్రోలింగ్ పెంచాలని సూచించారు. మరీ ముఖ్యంగా అమావాస్య రోజున మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆగస్టు 16, సెప్టెంబరు 14, అక్టోబరు 14న అమావాస్య వస్తుందని.. అమావాస్యకు వారం రోజులు ముందు, ఆ తర్వాత వారం రోజులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అంతేకాదు, ప్రజలు కూడా అమావాస్య రోజుల్లో అప్రమ్తతంగా ఉండాలని కోరారు.