Himachal Pradesh: హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ను వదలని వరదలు.. కొండచరియలు విరిగిపడి నలుగురి మృతి

  • మృతుల్లో ఇద్దరు మహిళలు, నాలుగు నెలల చిన్నారి
  • మరో రెండు మూడు రోజులపాటు భారీ వర్షాలు
  • హెచ్చరికలు జారీ చేసిన వాతావరణశాఖ
  • పాఠశాలలకు సెలవులు
4 dead in landslide in Uttarakhand

హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ను వరదలు ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు. నేటి నుంచి మూడు రోజులపాటు ఈ రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ వాతావరణశాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. చంబా, మండి జిల్లాల్లోని క్యాచ్‌మెంట్ ఏరియాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ ముంచెత్తే అవకాశం ఉందని పేర్కొంది. భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని తెలిపింది. నదులు, వాగుల్లో నీటిమట్టం పెరుగుతుందని, పంటలు, పండ్ల తోటలకు భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని తెలిపింది. 

ఉత్తరాఖండ్, తెహ్రీ జిల్లాలోని చంబాలో నిన్న కొండచరియలు విరిగిపడి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు మహిళలు, నాలుగు నెలల చిన్నారి ఉన్నారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కొండచరియలు విరిగి పడడంతో తెహ్రీ-చంబా మోటార్ రోడ్ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.

More Telugu News