అల్లూరి జిల్లాలో లోయలో పడిన ఆర్టీసీ బస్సు... ఇద్దరి మృతి
- అల్లూరి జిల్లాలో విషాద ఘటన
- చోడవరం నుంచి పాడేరు వెళుతున్న ఆర్టీసీ బస్సు
- పాడేరు ఘాట్ రోడ్డులో వ్యూ పాయింట్ వద్ద ప్రమాదం
- మలుపు తిరిగే క్రమంలో లోయలోకి దూసుకెళ్లిన బస్సు
ఆర్టీసీ బస్సు చోడవరం నుంచి పాడేరు వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. పాడేరు ఘాట్ రోడ్డులోని వ్యూ పాయింట్ వద్ద మలుపు తిరుగుతుండగా, బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు.