అమెరికాలో కర్ణాటక దంపతుల ఆత్మహత్య

  • భార్యాభర్తలు ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లే..
  • ఆరేళ్ల కొడుకుతో కలిసి సామూహిక ఆత్మహత్య
  • బంధువులకు సమాచారం అందించిన బాల్టిమోర్ పోలీసులు
  • సూసైడ్ కు కారణం తెలియలేదని, విచారణ జరుపుతున్నట్లు వెల్లడి
అమెరికాలోని బాల్టిమోర్ లో నివాసం ఉంటున్న కర్ణాటక దంపతులు ఆరేళ్ల కొడుకుతో సహా ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో మృతదేహాలను గుర్తించిన పోలీసులు దావణగెరెలోని బంధువులకు సమాచారం అందించారు. కుటుంబం మొత్తం సామూహికంగా ఆత్మహత్య చేసుకున్నట్లు ఫోన్ లో తెలిపారు. అయితే, ఆత్మహత్యకు కారణాలేంటనేది తెలియరాలేదని, విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. 

దావణగెరె జిల్లాకు హలేకల్లు గ్రామానికి చెందిన యోగేశ్ హొన్నాళ (37) అమెరికాకు వలస వెళ్లి సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా స్థిరపడ్డారు. తొమ్మిదేళ్ల క్రితం ప్రతిభ (35) ను పెళ్లి చేసుకున్నారు. భార్యాభర్తలు ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా మేరీల్యాండ్ లోని బాల్టిమోర్ లో పనిచేస్తున్నారు. ఈ దంపతులకు ఆరేళ్ల కొడుకు యశ్ ఉన్నాడు. దావణగెరెలో ఉంటున్న తల్లితో యోగేశ్ గురువారం ఫోన్ లో మాట్లాడారు. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ కుటుంబం మొత్తం చనిపోయారు. ఇంట్లో మృతదేహాలను గుర్తించిన పోలీసులు.. దావణగెరెలో ఉన్న బంధువులకు సమాచారం అందించారు. యోగేశ్ కుటుంబం మరణానికి కారణమేంటనే దానిపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.

Karnataka
couple
USA
boltimore
software engineers
commits suicide

More Telugu News