వైసీపీ నేత దేవినేని అవినాశ్ సంచలన వ్యాఖ్యలు!

  • నేను ఏ పార్టీలో బలిపశువును అయ్యానో అందరికీ తెలుసునని వ్యాఖ్య
  • టీడీపీ నేతల పిచ్చివాగుడును ప్రజలు నమ్మరన్న అవినాశ్
  • సీఎం జగన్ తనకు అండగా నిలిచారని వ్యాఖ్య
విజయవాడ ఈస్ట్ నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ దేవినేని అవినాశ్ శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర అట్టర్ ప్లాప్ అయిందన్నారు. తాను ఏ పార్టీలో బలిపశువును అయ్యానో అందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ నేతల పిచ్చివాగుడును ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోను నమ్మరన్నారు. పనికి రాని వారు తమపై విమర్శలు గుప్పిస్తున్నారన్నారు. తనకు ముఖ్యమంత్రి జగన్ అండగా నిలిచారని చెప్పారు.

దేవినేని అవినాశ్‌ను ముఖ్యమంత్రి జగన్ బలిపశువుగా మార్చారని టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు. లోకేశ్ చేస్తోన్న పాదయాత్రను అడ్డుకోవాలని చూస్తున్నారని, ఈ కుట్రలో భాగంగానే అవినాశ్ ఇంటికి సీఎం జగన్ వెళ్లారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై దేవినేని అవినాశ్ పైవిధంగా స్పందించారు.

Devineni Avinash
YSRCP
Telugudesam
Andhra Pradesh
Vijayawada

More Telugu News