Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ కాన్వాయ్‌కి సూర్యాపేట జిల్లాలో ప్రమాదం!

Accident in MLA Vallabhaneni Vamshi convoy
షార్ట్స్‌లో చూడండి
గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ కాన్వాయ్‌కి ప్రమాదం జరిగింది. విజయవాడ- హైదరాబాద్ 65వ జాతీయ రహదారిలో సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం కాశీంపేట వద్ద ఈ సంఘటన జరిగింది. వల్లభనేని వంశీ శనివారం ఉదయం కాన్వాయ్‌లో విజయవాడ నుండి హైదరాబాద్‌కు బయలుదేరారు. తెలంగాణ రాష్ట్రంలోని కాశీంపేట వద్ద ఈ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. కాన్వాయ్‌లోని చివరి రెండు వాహనాలు ఒకదానికొకటి పరస్పరం ఢీకొన్నాయి. అయితే ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. కానీ రెండు వాహనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి.
Go Back to Shorts
Vallabhaneni Vamsi
Vijayawada
Hyderabad

More Telugu News