SS Rajamouli: మగధీర సమయంలో పల్పిట్ రాక్స్ ఫొటోలు చూశాను... ఇన్నాళ్లకు సందర్శించాను: రాజమౌళి

  • ఇన్ స్టాగ్రామ్ లో రాజమౌళి పోస్టు
  • నార్వే వెళ్లిన రాజమౌళి
  • స్టావెంజర్ లో బాహుబలి కచేరీకి హాజరు
  • ప్రపంచ ప్రఖ్యాత పల్పిట్ రాక్స్ సందర్శన
Rajamouli visits world famous Pulpit Rocks in Norway

భారత చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరిగా ఎదిగిన ఎస్ఎస్ రాజమౌళి ఇన్ స్టాగ్రామ్ లో ఆసక్తికర పోస్టు పెట్టారు. నార్వేలోని ప్రపంచ ప్రఖ్యాత పల్పిట్ రాక్స్ వద్ద తన అర్ధాంగి రమతో ఆస్వాదిస్తున్న ఫొటోలను ఆయన పంచుకున్నారు. 

దీనిపై ఆయన స్పందిస్తూ... "మగధీర సమయంలో లొకేషన్స్ కోసం వెతికే సమయంలో ఈ పల్పిట్ రాక్స్ ఫొటోలు చూశాను. అప్పటి నుంచి ఇక్కడికి రావాలని అనుకుంటున్నాను. అది ఇన్నాళ్లకు కుదిరింది. అందుకు బాహుబలికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే, నార్వేలోని స్టావెంజర్ లో 'బాహుబలి' సినిమా సంగీత కచేరీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం కోసం మేం నార్వే రావడంతో ఇక్కడి పల్పిట్ రాక్స్ ను సందర్శించడానికి వీలైంది" అని వివరించారు.

More Telugu News