MSK Prasad: టీమిండియాలో అతడు తప్పకుండా ఉండాలి: ఎమ్మెస్కే ప్రసాద్

  • ఆసియా పిచ్ లపై అశ్విన్ నైపుణ్యాలు పనిచేస్తాయన్న అభిప్రాయం
  • ఆసియాకప్, వన్డే ప్రపంచకప్ కోసం చోటు ఇవ్వాలంటూ మద్దతు
  • ప్రత్యర్థి జట్లలో లెఫ్ట్ హ్యాండర్లు ఎక్కువ మంది ఉన్నారన్న ప్రసాద్
He is one guy who might be very handy MSK Prasad backs with ashwin

టీమిండియాలో అద్భుతాలు సృష్టించడానికి రవిచంద్రన్ అశ్విన్ ఉండాలన్న అభిప్రాయాన్ని మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వ్యక్తం చేశాడు. ఆసియాకప్ కు పాకిస్థాన్ ఇప్పటికే తన జట్టును ప్రకటించగా.. భారత్ తన స్క్వాడ్ ను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. ఈ తరుణంలో ఎమ్మెస్కే ప్రసాద్ అశ్విన్ కు మద్దతుగా స్వరం వినిపించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉపఖండంలో ఆసియాకప్ తర్వాత టీమిండియా సామర్థ్యానికి వన్డే ప్రపంచకప్ కీలకంగా మారనుంది.

ఆసియాకప్, వన్డే ప్రపంచకప్ కోసం అశ్విన్ ను టీమిండియా తప్పకుండా తీసుకోవాలన్న అభిప్రాయాన్ని ప్రసాద్ వ్యక్తం చేశాడు. వన్డే జట్టులో అశ్విన్ కు చోటు దక్కక చాలా కాలం అవుతోంది. గతేడాది బోలాండ్ పార్క్ లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో చివరిగా అశ్విన్ కనిపించాడు. ఆసియా పిచ్ లపై అశ్విన్ నైపుణ్యాలు ఎంతో అక్కరకు వస్తాయన్నది ప్రసాద్ అభిప్రాయంగా ఉంది. 

‘‘ఆసియా కప్ లపై ఆడుతున్న పరిస్థితుల్లో.. ప్రత్యర్థి జట్లలో ఎడమచేతి ఆటగాళ్లు ఉన్నందున రవిచంద్రన్ అశ్విన్ ఎంతో ఉపయోగపడతాడు. ఆస్ట్రేలియా జట్టులో ఎంతో మంది లెఫ్ట్ హ్యాండర్లు ఉన్నారు. ముఖ్యంగా శ్రీలంక, భారత్ లో ఆడుతున్న సమయాల్లో అశ్విన్ తప్పకుండా ఉండాలి’’ అని ఎమ్మెస్కే ప్రసాద్ పేర్కొన్నాడు.

More Telugu News