పొత్తు ఉన్నా లేకపోయినా కొత్తగూడెంలో పోటీ చేస్తాం: సీపీఐ నేత కూనంనేని
- సింగరేణి కార్మిక సమాఖ్య సమావేశంలో కూనంనేని వ్యాఖ్యలు
- సీపీఐ బరిలోకి దిగుతుందని స్పష్టం చేసిన రాష్ట్ర కార్యదర్శి
- బీఆర్ఎస్, కమ్యూనిస్ట్‌ల పొత్తుపై అంచనాల నేపథ్యంలో వ్యాఖ్యలు
పొత్తులో భాగంగా కొత్తగూడెం, పాలేరు, భద్రాచలం నియోజకవర్గాల సీట్లను సీపీఐ అడుగుతోంది. మరోవైపు ఇక్కడి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఆశావహులు తాము పోటీలో ఉంటామని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కూనంనేని వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. కూనంనేని 2009లో కొత్తగూడెం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014, 2018లో ఓడిపోయారు.