అద్భుతమైన ఐస్‌క్రీమ్స్‌ ఎక్కడ దొరుకుతాయో నాకు తెలుసు.. బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

biden tells kids he knows great ice cream places
  • ద్రవ్యోల్బణం తగ్గింపు చట్టం వార్షికోత్సవంలో పాల్గొన్న బైడెన్
  • ఎవరికైనా మంచి ఐస్‌క్రీమ్ కావాలంటే తనకు చెప్పాలని వ్యాఖ్య
  • ఐస్‌క్రీమ్స్‌ అంటే బైడెన్‌కు మహా ఇష్టం
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఐస్‌క్రీమ్స్‌ అంటే మహా ఇష్టం. ఐస్‌క్రీమ్స్‌ తింటూ అప్పుడప్పుడూ మీడియా కంట పడుతుంటారు. గతేడాది మధ్యంతర ఎన్నికల ప్రచార సమయంలో కూడా ఐస్‌క్రీమ్ తింటూ కనిపించారు. కాగా, వైట్‌హౌస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో అసలు విషయాన్ని పక్కనపెట్టి ఐస్‌క్రీమ్స్‌ గురించి మాట్లాడారు.

ద్రవ్యోల్బణం తగ్గింపు చట్టం (ఐఆర్‌‌ఏ) తొలి వార్షికోత్సవంలో బుధవారం (స్థానిక కాలమానం ప్రకారం) బైడెన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘పిల్లలకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. వైట్‌హౌస్‌ దగ్గర్లో అద్భుతమైన ఐస్‌క్రీమ్‌ దొరికే ప్రాంతాలు నాకు తెలుసు. మీలో ఎవరికైనా కావాలంటే నాకు చెప్పండి” అని సరదాగా అన్నారు. దీంతో ఈ సమావేశానికి హాజరైన వారందరూ నవ్వేశారు. తర్వాత ఐఆర్‌‌ఏ గురించి మాట్లాడటం కొనసాగించారు.

 మరోవైపు ఓ ఐస్‌క్రీమ్‌ బ్రాంచ్‌లో బైడెన్‌ కోసమే ప్రత్యేకమైన ఫ్లేవర్‌‌ను తయారు చేస్తున్నారనే ప్రచారం కూడా ఉంది.
Go Back to Shorts
Joe Biden
ice cream
children
US President
Inflation Reduction Act
White House

More Telugu News