పెళ్లిళ్ల సీజన్ వేళ భారీగా తగ్గిన బంగారం ధర
- తులం బంగారంపై రూ.380 తగ్గింపు
- 24 క్యారెట్ల గోల్డ్ పది గ్రాముల ధర రూ.59,020
- రూ.500 మేర తగ్గిన కిలో వెండి ధర
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, విశాఖపట్నంలతో పాటు కేరళ, బెంగళూరు, కోల్కతా, ముంబైలలో కూడా హైదరాబాద్ లోని ధరలే కొనసాగుతున్నాయి. తమిళనాడులోని చెన్నైలో మాత్రం 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.54,560 కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.59,520 లుగా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.54,250, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.59,170 లుగా ఉంది. ఇక, వెండి ధరలు.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం, చెన్నై, కేరళలో కిలో వెండి ధర రూ.75,700 గా ఉండగా.. బెంగుళూరు, కోల్కతా, ముంబై, ఢిల్లీలో కిలో ధర రూ.72,500 లు గా ఉంది.