తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు
- ఎల్లుండి పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపుల వాన
- ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
- ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం
ఉత్తరాది రాష్ట్రాలు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ లను వర్షాలు ముంచెత్తుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లో వర్షాలు, వరదల కారణంగా రూ.10 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు తెలిపారు. తాము కోలుకోవడానికి ఏడాదికి పైగా సమయం పడుతుందని వివరించారు. పంజాబ్‌లోని హోషియార్‌పూర్, గురుదాస్‌పూర్, రూప్‌నగర్ జిల్లాల్లో చాలా ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. అక్కడి ప్రజలను కాపాడేందుకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఆర్మీ, బీఎస్‌ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి.