వైజాగ్-సికింద్రాబాద్ వందేభారత్ రైలు రద్దు.. ప్రయాణికుల గుస్సా

Vizag secunderabad vandebharat express suspended after last minute
  • ఈ ఉదయం బయలుదేరాల్సిన రైలు సాంకేతిక కారణాలతో రద్దయినట్టు అధికారుల ప్రకటన
  • ఉదయం 7.00 గంటలకు మరో ప్రత్యామ్నాయ రైలు ఏర్పాటు చేసినట్టు వెల్లడి
  • వందేభారత్ ఆగే స్టేషన్లు అన్నిటిలో ప్రత్యామ్నాయ రైలు కూడా ఆగుతుందని వివరణ
గురువారం ఉదయం విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్లాల్సిన వందేభారత్ రైలును రద్దు చేసినట్టు రైల్వే అధికారులు ప్రకటించారు. సాంకేతిక సమస్యల కారణంగా ఈ ఉదయం గం.5.45కు బయలుదేరాల్సిన రైలును రద్దు చేసినట్టు వివరించారు. అయితే, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉదయం 7 గంటలకు మరో రైలును ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. 

వందేభారత్ రైలు ఆగే స్టేషన్లన్నింటిలో ఈ రైలు ఆగుతుందని చెప్పారు. ఉదయం 5 గంటల నుంచే రైలు రద్దు సమాచారాన్ని ప్రయాణికులకు అందజేశామని వివరించారు. కాగా, చివరి నిమిషంలో వందేభారత్ రైలు రద్దు కావడంతో అనేక మంది ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Go Back to Shorts
Vande Bharat
Vizag
Secunderabad

More Telugu News