ఆ కాంట్రాక్ట్ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం స్వాతంత్ర్య దినోత్సవ కానుక
- 2014 జూన్ 2 ముందు నియమితులైన ఉద్యోగుల క్రమబద్ధీకరణ
- ఇందుకోసం ఐదేళ్ల సర్వీసు నిబంధనను సడలిస్తూ ప్రభుత్వం నిర్ణయం
- నాలుగు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం
వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని పేర్కొన్నారు. హామీలో భాగంగా 2014, జూన్ 2 నాటికి ఐదేళ్లు పూర్తి చేసుకున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను మాత్రమే రెగ్యులర్ చేయాలని గత కేబినెట్లో తీర్మానం చేశారు. దీంతో ఐదేళ్ల సర్వీసు పూర్తికాని ఉద్యోగులకు ఈ ప్రయోజనం దక్కలేదు. దీనిపై అభ్యంతరాలు వ్యక్తంకావడంతో ప్రభుత్వం పునఃపరిశీలన చేసింది.