'బాయ్స్ హాస్టల్' నుంచి సాంగ్ రిలీజ్

Boys Hostel movie song released
కన్నడలో హిట్ కొట్టిన 'హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే'
తెలుగు టైటిల్ గా 'బాయ్స్ హాస్టల్'
సంగీతాన్ని సమకూర్చిన అజనీశ్ లోక్ నాథ్ 
ఈ నెల 26వ తేదీన విడుదల 

'కేజీఎఫ్' .. 'కాంతార' వంటి సినిమాలు విడుదలైన ప్రతి భాషలోను విజయాన్ని సాధించాయి. దాంతో కన్నడ నుంచి చిన్న సినిమాలు కూడా ఇతర భాషల్లో విడుదల చేస్తున్నారు. అలాంటి ఒక సినిమాగా 'బాయ్స్ హాస్టల్' కనిపిస్తోంది. కన్నడలో 'హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే' అనే పేరుతో రూపొందిన ఈ సినిమా అక్కడ భారీ విజయాన్ని అందుకుంది.
 
నితిన్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించిన ఈ సినిమా, అక్కడ జులై 21వ తేదీన విడుదలైంది. చాలా చిన్న సినిమాగా థియేటర్లకు వెళ్లిన ఈ సినిమా, మౌత్ టాక్ తో అక్కడ భారీ వసూళ్లను రాబట్టింది. క్రైమ్ కామెడీ నేపథ్యంలో సాగే ఈ సినిమాను, అన్నపూర్ణ స్టూడియోస్ - చాయ్ బిస్కెట్ వారు  'బాయ్స్ హాస్టల్' పేరుతో ఈ నెల 26వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. 

 ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం ఒక సాంగును రిలీజ్ చేశారు. మంది కుర్రాళ్ల హాస్టల్ లైఫ్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. హాస్టల్ వార్డెన్ అనుమానాస్పద మృతి చుట్టూ ఈ కథ తిరుగుతుంది.  అజనీశ్ లోక్ నాథ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచిందని అంటున్నారు.  రిషబ్ శెట్టి - రమ్య ఈ సినిమాలో అతిథి పాత్రల్లో కనిపించనున్నారు.

Advertisement
Prajwal
Manjunath
Rakesh
Boys Hostel

More Telugu News