మోదీ మాటలను జనాలు ఎవరూ వినే స్థితిలో లేరు: లాలూ ప్రసాద్ యాదవ్
- ఎర్రకోటపై మోదీ జెండాను ఎగురవేయడం ఇదే చివరిసారి అన్న లాలూ
- స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది త్యాగాలు చేశారని వ్యాఖ్య
- వారి సేవలను దేశం ఎప్పటికీ మర్చిపోదన్న లాలూ
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశానికి స్వాతంత్ర్యాన్ని సాధించడానికి ఎంతో మంది త్యాగాలు చేశారని, వారి సేవలను దేశం ఎప్పటికీ మర్చిపోదని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధులకు నివాళి అర్పిస్తున్నామని చెప్పారు.