స్వాతంత్ర్య దినోత్సవాన ప్రధాని గిఫ్ట్.. సంప్రదాయ కార్మికులకు ‘విశ్వకర్మ యోజన’ పథకం ప్రకటన
- విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని సెప్టెంబరు 17న ప్రకటన
- స్వర్ణకారులు, కమ్మరులు, రజకులు, క్షురకులు, తాపీ మేస్త్రీల కోసం ‘విశ్వకర్మ యోజన’
- ప్రాథమికంగా రూ. 13000-రూ. 15,000 కోట్ల కేటాయింపు
- వచ్చే ఐదేళ్లలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో దేశం అగ్రగామిగా నిలుస్తుందన్న మోదీ
సెప్టెంబరు 17న విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు మోదీ పేర్కొన్నారు. పేదరికాన్ని నిర్మూలిస్తామన్న ప్రధాని మోదీ.. వచ్చే ఐదేళ్లలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో దేశం అగ్రగామిగా నిలుస్తుందని చెప్పారు. వచ్చే స్వాతంత్ర్య దినోత్సవాన దేశం సాధించిన విజయాలను ఎర్రకోట నుంచి వివరిస్తానని చెప్పారు.